నవతెలంగాణ-తుర్కయంజాల్
మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌స్సోర్సింగ్, ఎన్‌ఎంఆర్, ఫిక్స్‌డ్-పే తదితర సిబ్బందిని అందరినీ పర్మినెంట్ చేయాలని, వేత నాలను కేటగిరీల వారిగా చెల్లించాలని, పర్మినెంట్ ఉద్యోగులకు చెల్లిస్తున్నట్లే కాంట్రాక్ట్ ఔట్‌స్సోర్సింగ్ వారికి కూడా ఐఆర్ (భృతి) ఇవ్వాలని కోరుతూ బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ మల్‌రెడ్డి అనురాధ కి, కమిషనర్ శ్రీకాంత్‌లకు కార్మికులతో కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐటీయూ రంగా రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు, మున్సిపల్ వర్కర్స్ యూ నియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.కిషన్ మాట్లా డుతూ..ప్రస్తుతం పెరుగుతున్న నిత్యవసర సరుకు ల ధరలతో పోలిస్తే మున్సిపల్ కార్మికులకు ఇస్తున్న వేతనం ఏ మూలకూ సరిపోవడంలేదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇస్తున్నట్లుగా రూ.21 వేల వేతనాలను ఇవ్వాలని కోరారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌స్సోర్సింగ్‌్, ఎన్‌ఎమ్‌ఆర్, ఫిక్స్‌డ్-పే తదితర పద్ధతుల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం నియ మించబోయే రెండవ పీఆర్సీ కమిషన్ సిఫార సుల్లో భాగమైన ఐఆర్(మధ్యంతర భృతి)ని పర్మినెం ట్ ఉద్యోగులతోపాటు మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్‌స్సో ర్సింగ్ కార్మికులకూ చెల్లించాలని ప్రభుత్వా న్ని డి మాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు డబుల్ బెడ్రూంలతో పాటు అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలనూ వర్తింపజే యాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీల అభివృ ద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యల విషయంలో మున్సిపల్ అధికారులు పాలకవర్గాలు జోక్యం చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. లేని యెడల సీఐటీయూ ఆధ్వర్యంలో దశల వారి పోరాటాలకు కార్మికులనంతా సిద్ధం చేసి సెప్టెంబర్ 30న చలో హైదరాబాద్ నిర్వహించి రా ష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెకు వెళ్తామని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తుర్కయంజాల్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు మేతరి దాసు, శీలం.నగేష్, యూనియన్ జిల్లా నాయకులు నవీన్ కుమార్ సీఐటీయూ నాయకులు నక్మల్ల యాదగిరి, ఎంజె.ప్రకాష్ కారత్, పి.జగన్, కార్మిక నాయకులు రవిచందర్, అర్జున్ శివ మహిపాల్, మధు, రాజు తదితరులు పాల్గొన్నారు.