– అక్రమ పట్టాలు జారీ…!
– లబోదిబోమంటున్న బాధితులు
నవతెలంగాణ-వాజేడు
రెవెన్యూ నూతన భూమి పట్టాల జారీలో రెవెన్యూ కార్యాలయం అక్రమాలకు నెలవుగా మారిందని, రవెన్యూ అధికారులు ముడుపులకు దాసోహమై పనిచేస్తూ సాధారణ మధ్యతరగతి రైతులకు సవాలక్ష సాకులతో కాలయాపన చేస్తు ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ అనేక మంది గిరిజనేతరులకు అక్రమ పట్టాలు జారి చేసినట్లు తెలుస్తున్నది. ఇందుకు వాజేడు మండలమే నిదర్శనం. వాజేడు మండలం కొరకల్ ధర్మారంలో 75, 105, 66, 66/అ /1, 66/అ /2, 66/అ /ఆ, 66/ఇ, 66/1, సర్వే నెంబర్లలో పది ఎకరాల బంజర్ భూమినీ 1936 లో గౌరారపు నర్సయ్య, రంగు బుచ్చయ్య ఇరువురు కలిసి చదును చేసుకొని జాయింట్‌గా వ్యవసాయం సాగించి ఇరువురి పేర్లపై జాయింట్ పట్టా చేసుకున్నారు. వారి తదనంతరం గౌరారపు నర్సయ్యకు వాటాకు చెందిన ఐదు ఎకరాల భూమిని అక్రమంగా రంగయ్య కుమారులు,కూతుర్ల పేర్లపై అధికారులు పట్టాలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమని భూమి పైకి రానివ్వకుండా అడ్డుపడుతూ చంపుతామని బెదిరిస్తూ ఉన్నట్లు బాధిత కుటుంబం తెలిపింది. రెవెన్యూ అధికారుల అక్రమ పట్టాల జారిపై విచారణ చేసి తమ కుటుంబ పోషణకు ఆధారమైన ఆధారమైన భూమినీ ఇతరులకు అక్రమ పట్టా జారీ చేసిన రెవెన్యూ అధికారులపై జిల్లా అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.