నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వేను ప్రజలంతా స్వాగతించి సహకరించాలని ధర్మసమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్ ఉగ్రవాయి బోలెశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమక్షంలో ఆయన మాట్లాడుతూ కుల గణన సర్వే భారత రాజ్యాంగ మూల సిద్ధాంతంపై ఆధారపడిందని తెలిపారు. ప్రభుత్వంసర్వే రిపోర్ట్స్ ని త్వరగా తెప్పించి రాష్ట్రంలో రాజకీయ, ఆర్థిక సంపదలో సామాజిక న్యాయాన్ని 90 శాతం అణగారిన కులాలందరికీ సమానంగా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో జిల్లా కో కన్వీనర్ రాజు మహారాజ్,జిల్లా కమిటీ సభ్యులు, గంగరాజు,శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.