– ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
– ముఖ్య కూడలి విస్తరణ కోసం అఖిలపక్షం సమావేశం
నవతెలంగాణ-షాద్‌నగర్
జనాభాను దష్టిలో ఉంచుకొని అభివద్ధికి సహకరించాలని, అందరి సలహాలతో షాద్ నగర్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. జనాభా ప్రాతిపాదికన షాద్‌నగర్ ముఖ్య కూడలిని విస్తరణ చేపట్టడానికి ఆర్‌అండ్‌బి, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అఖిలపక్ష నేతలు పాల్గొని తమ వాదనలను వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్తు తరాలను దష్టిలో పెట్టుకుని రోడ్డు విస్తరణ చేయాలని, పట్టణ ముఖ్య కూడలిలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతోందని అన్నారు. జనాభా పెరిగిపోతుంది సౌకర్యాలు సరిగ్గా లేనందున సర్కిల్ వంద ఫీట్ల విస్తరణ చేయబోతున్నట్టు తెలిపారు. ముఖ్య కూడలిలో ఏమైనా నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తే ముఖ్యమంత్రితో చర్చిస్తామని వివరించారు. అన్నివర్గాలను దష్టిలో ఉంచుకొని అభివద్ధి కోసం కషి చేస్తామని, కొన్ని సందర్భాలలో కఠినమైన నిర్ణయలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. అభివద్ధి జరుగుతున్నప్పుడు కొందరికి నష్టం మరికొందరికి లాభం చేకూరవచ్చని దానికి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని వివరించారు. అఖిల పక్ష నేతలకు అందరికి ఆహ్వానం పలికామని, మా ఆహ్వానం మన్నించి అందరూ సలహాలు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బక్కని నర్సింహులు, భీష్వ కిష్టయ్య, సి.ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ నరేందర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, పట్టణ సీఐ విజరు కుమార్, ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్, మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈ రవీందర్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ రాజు, బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్, కౌన్సిలర్లు కానుగు అనంతయ్య, సర్వర్ పాషా, నందీశ్వర్, రాయికల్ శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, రఘు, చెంది తిరుపతిరెడ్డి, బాలరాజ్ గౌడ్, తోకల దామోదర్ రెడ్డి, బీజేపీ నాయకులు మల్చాలం మురళి, వంశీ, బీఆర్‌ఎస్ నాయకులు యుగంధర్, మీడియా ప్రతినిధులు, మోహన్ రెడ్డి, శరత్, ఖాజా పాషా, మిద్దెల సత్యనారాయణ, రాజేష్, సరపు రమేష్, భాస్కర్, ధన్నారం రమేష్, శివ, రాజశేఖర్ గౌడ్, అర్షద్ తదితరులు పాల్గొన్నారు.