స్వచ్ఛ దుబ్బాకకు సహకరించాలి

మున్సిపల్‌ కమిషనర్‌
నవతెలంగాణ-దుబ్బాక
దుబ్బాక పురపాలిక పరిధిలోని అన్ని వార్డుల్లో చెత్తను బహిరంగ ప్రదేశాల్లో, మురికి కాలువల్లో వేయవద్దని, మున్సిపాలిటీకి చెందిన చెత్త సేకరణ వాహనానికి మాత్రమే అందించాలని కమిషనర్‌ పాతూరి గణేష్‌ రెడ్డి కోరారు. అన్ని విధాల అభివద్ధి చెందుతున్న దుబ్బాక మున్సిపాలిటీని ”స్వచ్ఛ దుబ్బాక”గా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. శుక్రవారం పురపాలిక పరిధిలోని చెల్లాపూర్‌ 4 వ వార్డ్‌లో ప్రత్యేక పారిశుద్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ఇందులో భాగంగా మురికి కాలువలను శుభ్రపరచడం, వాటి చుట్టూ పేరుకుపోయిన గడ్డిని తొలగించడం జరిగిందన్నారు. ఇంచార్జ్‌ శానిటరీ ఇన్‌ స్పెక్టర్‌ మట్టి దిలీప్‌ కుమార్‌, శానిటరీ జవాన్‌ అనిల్‌, పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు.