
– ఈనెల 28న తుది జాబితా ప్రచురణ
నవతెలంగాణ- మల్హర్ రావు
గ్రామీణ ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించాలని మండల ఎంపిడిఓ శ్యామ్ సుందర్ కోరారు. గురువారం మండల కేంద్రమైన తాడిచెర్ల మండలపరిషత్ కార్యాలయంలో తాజా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడారు ఈనెల 13న గ్రామపంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేశామని తెలిపారు. ఇందులో అభ్యంతరాలు, నూతన ఓటర్ల దరఖాస్తులను 21వ తేదీలోపు బిఎల్ఓ లకు లిఖిత పూర్వకంగా సమర్పించాలని చెప్పారు. ఆపై 26లోగా అభ్యంతరాలను పరిష్కరించి 28న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామన్నారు. ఈ మేరకు అర్హులు దరఖాస్తు చేసుకునేలా అవగాహన నిర్వహించినట్లుగా తెలిపారు.ఒక కుటుంబంలో సభ్యులందరికీ ఒకే వార్డులో ఓట్లు ఉండేలా కార్యా చరణ రూపొందించినట్లుగా తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు బడితేల రాజయ్య, రాఘవ రెడ్డి, ముడుతనపల్లి ప్రభాకర్, నాగరాజు పాల్గొన్నారు.