ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలచెలిమి, చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అకాడమీ వారు సంయుక్తంగా గ్రంథాలయం ఏర్పాటు కోసం ముందుకు వచ్చారని తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థుల్లో భాషపై మక్కువ పెంచడాని కోసం, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నుకోబడిన పాఠశాలలకు వారు సహకారం అందిస్తున్నారని, ఇందులో భాగంగా పాఠశాలకు సుమారు 30 వేల నుండి 40 వేల రూపాయల విలువైన పుస్తకాలను అందించడానికి ముందుకు వచ్చారని అన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, బాల చెలిమి గ్రంథాలయ నిర్వాహకులు మణికొండ వేద కుమార్, బాల సాహిత్య కన్వీనర్ గరిపల్లి అశోక్, తదితరులను కలిసినట్లు తెలిపారు.