భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు..

– ముగ్గురు మాల్దీవుల మంత్రులపై వేటు
న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి లక్షద్వీప్‌ పర్యటనపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిపై భారత్‌తోపాటు అంతర్జాతీయంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన మాల్దీవుల ప్రభుత్వం.. ముగ్గురు మంత్రులపై వేటు వేసింది. సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు పెట్టిన వారిని పదవి నుంచి తప్పించినట్టు మాల్దీవుల విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, ఎవరిపై చర్యలు తీసుకున్నారనేది మాత్రం వెల్లడించలేదు. మాల్దీవుల స్థానిక మీడియా ప్రకారం, మరియం షియునా, మాల్షాతోపాటు మరో మంత్రి హసన్‌ జిహాన్‌లను మంత్రి పదవుల నుంచి తప్పించినట్లు సమాచారం.