వివాదాస్పదం అవుతున్న రహదారి విస్తరణ పనులు…

– నిరసన కు దిగిన ముస్లింలు..
– పరిశీలిస్తాం అన్న ఆర్ అండ్ బీ ఈఈ వెంకటేశ్వరరావు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఏండ్లు కు ఏండ్లు నెత్తి నడకన సాగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులు నేడు వివాదాస్పదం అవుతున్నాయి.రోడ్డు విస్తరణలో పలువురు చిరు వ్యాపారులు జీవనోపాధి కోల్పోవడంతో నిరసన గా మారింది. శనివారం సత్తుపల్లి రోడ్ లో ఒక వైపు విస్తరణ కోసం సైడ్ దుకాణాలు ను తొలగించే క్రమం లో ఒక మతానికి చెందిన వారే నిర్వాసితులు కావడం తో ఎటు దారితీస్తుందో అని పలువురు ఆందోళనకు గురి అవుతున్నారు. డివైడర్ నుండి 50 అడుగుల దూరం లో డ్రైనేజీ నిర్మించడానికి 53 అడుగులు అవసరం వచ్చింది. దీంతో కాంట్రాక్టర్ అంతకంటే మరో 3 అడుగులు అదనంగా డ్రైనేజీ కోసం స్థలం అవసరం ఉంటుందని చిరు దుకాణాలను తొలగించారు. అయితే డివైడర్ నుండి అంత దూరం అవసరం లేదని శనివారం పనులు పర్యవేక్షణ కోసం వచ్చిన ఆర్ అండ్ బీ ఈఈ వెంకటేశ్వరరావు తెలపడంతో కావాలనే కొందరు ఈ ఘాతుకానికి పాల్పడి దుకాణాలు తొలగింపుకు కారణం అయ్యారని గ్రహించిన ముస్లింలు ఆయన కూ వినతి పత్రం ఇచ్చిన నిరసనకు దిగారు. సాయంత్రం సంబంధిత అధికారులు వచ్చి నచ్చజెప్పినా వినని నిర్వాసితులు నిరసన కొనసాగిస్తున్నారు.