ఇథనాల్ పరిశ్రమపై ముదురుతున్న వివాదం..

– బోరు బావి పనులను అడ్డుకున్న గుగ్గీల్ల గ్రామస్తులు 
– తోడిన బోరుబావిని పూడ్చిన వైనం 
నవతెలంగాణ – బెజ్జంకి 
మండల పరిధిలోని గుగ్గీల్ల గ్రామ శివారులో నిర్వహించ తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమపై రోజురోజుకు వివాదం ముదురుతోంది. గ్రామ శివారులో ఇథనాల్ పరిశ్రమ నిర్మాణ పనుల కోసం యాజమాన్యం బోరుబావి పనులను అదివారం చేటట్టింది. సమాచారం తెలుసుకున్న గుగ్గీల్ల గ్రామస్తులు బోరుబావి పనులను అడ్డుకున్నారు. సుమారు రెండోందల పీట్ల వరకు తవ్విన బోరుబావిని గ్రామస్తులు పూడ్చివేశారు. ఇథనాల్ పరిశ్రమ నిర్మాణ కోసం జారీ చేసిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేయాలని లేనిపక్షంలో అందోళనలు ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని గ్రామస్తులు హెచ్చరించారు.