Pincode App ద్వారా ఆహార పదార్థాలు, కిరాణా సరకులు ఆర్డర్ చేసే సౌలభ్యం

నవతెలంగాణ- హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో తమ సేవలు అందుబాటులోకి వచ్చాయని ONDC వేదికలో అభివృద్ధి చేసిన స్థానిక షాపింగ్ యాప్ Pincode నేడు ప్రకటించింది. హైదరాబాద్ లోని వినియోగదారులు ఇప్పడు Pincodeలో తమకు వచ్చిన స్థానిక దుకాణాలు, రెస్టారెంట్లన్నిటినుండి కిరాణా సరకులు, ఆహార పదార్థాలను ఆర్డర్ చేయడం వీలవుతుంది. ప్యారడైజ్ బిర్యానీ, బెహ్రోజ్ బిర్యానీ, రాయలసీమ రుచులు, పిజ్జా హట్ లాంటి విఖ్యాత స్థానిక బ్రాండ్లు ఉండడంతో, Pincode తన వినియోగదారులకు తమకు నచ్చిన దుకాణాలు, రెస్టారెంట్లను నేరుగా బ్రౌజ్ చేసి, సరైన ధరలకు, అనేక రకాల ఉత్పత్తుల నుండి ఆర్డర్ చేయవచ్చు.  ఈ వేదిక ఇబ్బందులు కలిగించని రీఫండ్లు మరియు రిటర్న్ ల సౌలభ్యంతో ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించి, నిరంతరాయ షాపింగ్ అనుభవం జరిగేలా చూస్తుంది. తన వినియోగదారులకు సమగ్రమైన షాపింగ్ అనుభవాన్ని అందించడం కోసం Pincode ఫార్మా, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ లాంటి అదనపు విభాగాలకు విస్తరించడంపై చాలా చురుగ్గా కృషి చేస్తుంది. బెంగళూరులో ఏప్రిల్ నెలలో అవిష్కరించిన Pincode యాప్ ఇప్పటికే లక్షకు పైగా ఆర్డర్లను డెలివరీ చేసింది. Pincode జనరల్ మేనేజర్ లలిత్ సింగ్ మాట్లాడుతూ “హైదరాబాద్ నగరంలో మా సేవలు ప్రారంభించడం మాకు ఎంతో ఉత్కంఠగా ఉంది. తొలి నాళ్లలో లభించిన స్పందన, వేగవంతంగా వినియోగదారులు Pincodeను స్వీకరించడం మా సేవలను విస్తరించడానికి అవసరమైన నమ్మకాన్ని మాకు కలుగజేసింది. స్థానిక విక్రేతలను విజేతగా నిలపాలని, అలాగే మా వినియోగదారులకు ఒక విశిష్ఠమైన షాపింగ్ అనుభవాన్ని అందించాలని మేము కృత నిశ్చయంతో ఉన్నాము. స్థానిక దుకాణాలకు డిమాండ్ ను తీసుకురావడం కోసం ఉత్సాహపూరితమైన వినియోగదారు ఆఫర్లను కూడా మేము ఆవిష్కరించనున్నాము. రాబోయే నెలల్లో మరిన్ని నగరాలకు విస్తరించేందుకు అవసరమైన ఆశయాత్మక ప్రణాలికలు కూడా మా వద్ద ఉన్నాయి. ” అని అన్నారు. Pincode పరిచయం: Pincode అనేది ఇ-కామర్స్ కు విప్లవాత్మకమైన సరికొత్త విధానాన్ని అందిస్తున్న ఒక షాపింగ్ యాప్. ONDC నెట్ వర్క్ లో రూపొందిన ఈ Pincode యాప్ డిజిటల్ షాపింగ్ వృద్ధి రంగంలో స్థానిక దుకాణాలను, విక్రేతలను ముందు నిలుపుతోంది. Pincodeతో, ప్రతి భారతీయ దుకాణదారు తామున్న ప్రదేశంతో సంబంధం లేకుండా ఇ-కామర్స్ విస్తృత సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకునేలా డిజిటల్ శక్తిని అందుకుంటున్నారు. తద్వారా భారీ స్థాయిలో నవ్యతను ముందుకు తీసుకువెళుతూనే అభివృద్ధికి ఇది గతంలో ఎన్నడూ చూడనన్ని అవకాశాలను కల్పిస్తోంది.