ఉపాధి కూలీల హక్కులను కాపాడటకై జహంగీర్ ని గెలిపించండి

నవతెలంగాణ – మునుగోడు

ఉపాధి కూలీల హక్కులు రక్షించి ఉపాధి కూలీని 200 రోజులకు పెంచి రూ.600 వేతనము ఉండాలంటే  భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి ఎండి జాంగిర్ ని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఉపాధి కూలీలను కోరారు. మంగళవారం గట్టుప్పల మండలం వెల్మకన్న గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఉపాధి కూలీలను పని ప్రదేశంలో కలిసి  మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు కార్మిక వర్గానికి ఉపాధి హామీ కల్పించాలని చట్టం తేవడానికి సీపీఐ(ఎం) పార్టీ పోరాడిందని దాని ఫలితంగానే ఉపాధి హామీ పని వచ్చిందని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉపాధి కూలీలకు 200 రోజులు పని కల్పించి రూ.600 వేతనం ఇవ్వడానికై సీపీఐ(ఎం) పార్టీ అనునిత్యం పోరాటం చేస్తున్నదని గుర్తు చేశారు. కార్మికుల హక్కులు కాపాడాలంటే సీపీఐ(ఎం) పార్టీ బలపరిచిన అభ్యర్థి జాంగిర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఉపాధి కూలీలను కోరారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపి అన్ని వస్తువులపై విపరీతమైన ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో మారు బీజేపీకి ఓటు వేసినట్లయితే బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చాలని యోచిస్తుందని, అలా జరిగితే కార్మికుల హక్కులు కాపాడబడమని అన్నారు. కాబట్టి ప్రజల సమస్యల పైన అనునిత్యం పోరాడే సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించినట్లయితే  రైతులు కార్మికులు కూలీల హక్కులకై పార్లమెంటులో పోరాడే జహంగీర్ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండ వెంకన్న, వెల్మకన్నె ఎంపీటీసీ చాపల మారయ్య, జిల్లా మండల కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.