హోవర్డ్స్ హై స్కూల్ విద్యార్థులకు వంటల పోటీలు

నవతెలంగాణ – కంటేశ్వర్
స్థానిక న్యాల్కల్ రోడ్ రోటరీ నగర్ నందుగల హోవార్డ్ హైస్కూల్లో విద్యార్థులకీ కుకరి  పోటీలు (వంటల పోటీలు) వారే వాహ శనివారం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస రావు మాట్లాడుతూ.. నేటి విద్యార్థుల్లో సృజనాత్మకత చురుకుదనం వంటివి జాగ్రత్తగా గమనిస్తూ పోటీ తత్వాన్ని పెంచుతూ వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని దీనివలన వారి మనోశక్తి, ఏకాగ్రత ఆత్మస్థైర్యం వంటివి బలపడతాయని అన్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సుజాత  సరితలు హాజరై విద్యార్థులు తయారు చేసినటువంటి పదార్థాలను రుచి చూసి, అలంకరణ, వాడిన పదార్థాల ఆధారంగా విజేతలను నిర్ణయించడం జరిగినది. విద్యార్థులు అధిక సంఖ్యలో ఆసక్తిగా ఆనందంగా పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కార్యక్రమాన్ని అభినందిస్తూ ఇలాంటి వినూత్న మైన కార్యక్రమాలు నిర్వహించినందుకు మేనేజ్మెంట్ అయినటువంటి టివిఆర్ మూర్తి, డాక్టర్ టీఎస్ శశికళ కి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది సహకారంతో కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది.