సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ ఆధ్వర్యంలో ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఐసిడిఎస్ కార్యాలయం ఆవరణలో బుధవారం అంగన్వాడి టీచర్ అండ్ హెల్పర్లు వంట వార్పుతో వినూత్న నిరసన తెలిపారు. అంగన్వాడి యూనియన్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మక్క మాట్లాడుతూ 17 రోజులుగా సమస్య పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి పదేళ్ల అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం సరికాదన్నారు.మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో అధికారులు, నాయకులు, ప్రజాప్రతితులు అంగన్వాడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి పంపాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్య పరిష్కరించే అంతవరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ మండల అధ్యక్షురాలు జమున, అంగన్వాడీ నాయకులు సరిత, రుక్మిణి, సుజాత, నిర్మల, మంజుల, ఆదిలక్ష్మి, ఆయాలు సమ్మక్క రాజమ్మ సత్యమ్మ, 80 మంది అంగన్వాడీలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.