కోఠి ప్రభుత్వ ఈఎన్ టి ఆసుపత్రిలో కూల్ డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్లు ప్రారంభం..

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
రోగుల సౌకర్యార్థం స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేందుకు మంచుకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోఠి ప్రభుత్వం ఈ ఎన్ టి ఆసుపత్రిలో కూల్ డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్లను ఏర్పాటు చేశారు. శనివారం ప్రభుత్వం ఈ ఎన్ టి ఆసుపత్రి లో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, మంచుకొండ ఫౌండేషన్ చైర్మన్ మంచుకొండ ప్రకాశం తో కలిసి కూల్ డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ మాట్లాడుతూ.. వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మంచుకొండ ఫౌండేషన్ వారు శుద్ధి చేసిన చల్లని త్రాగునీరు అందించెనందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఫౌండేషన్ చైర్మన్ మంచుకొండ ప్రకాశం మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న రోగుల దాహార్తిని తీర్చేందుకు తమ ఫౌండేషన్  కు ఈ అవకాశం కల్పించినందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ గాంధీ, నిమ్స్ ఆసుపత్రులతోపాటు ఉస్మానియా, పేర్ల బురుజు ఆసుపత్రుల్లో మంచినీటి కూల్ డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ట్రస్టీలు రవికుమార్, సురేందర్, వరుణ్ కుమార్, అరుణ్ కుమార్, ప్రొఫెసర్ లు డాక్టర్ సంపత్ కుమార్ సింగ్, డాక్టర్ ఎల్  ఎస్ రెడ్డి, డాక్టర్ ఆనంద ఆచార్య, డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ రవి శంకర్, వైద్య సిబ్బంది రవి, ఎల్ టి రాజేందర్, మధు, సురేందర్ రెడ్డి, శ్రీనివాస్, మంచుకొండ ఫౌండేషన్ కో-ఆర్డినేటర్ శ్రావణ్ కుమార్,  వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.