కూల్‌ డ్రింక్స్‌ను నిషేధించాలి

కూల్‌ డ్రింక్స్‌ను నిషేధించాలి– పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగాలి : మాజీ వీసీ ప్రొ. ఎస్వీ సత్యనారాయణ, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ. కోయ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-ఓయూ
దేశ ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్న శీతల పానీయాలను నిషేధించాలని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వీసీ ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోయ వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. ప్రజలు కూడా ఎవరికి వారే హానికరమైన కూల్‌ డ్రింక్స్‌ను బహిష్కరించాలని సూచించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) హైదరాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎన్‌సీసీ గేటు వద్ద ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్వీ సత్య నారాయణ మాట్లాడుతూ.. దేశ ప్రజల ఆరోగ్యానికి శీతల పానీయాల రూపంలో పెనుముప్పు పొంచి ఉందన్నారు. పురుగుల మందుల తయారీలో వాడే రసాయనాలతో కూల్‌ డ్రింక్స్‌ తయారు చేస్తున్నారని చెప్పారు. వాటిని తాగితే ప్రజల ఆరోగ్యం పాడవుతుందన్నారు. గ్రామాల్లోనూ తాగునీరు లేకున్నా శీతల పానీయాలు మాత్రం పుష్కలంగా దొరుకుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బులు చెల్లించి మరీ అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నామని వాపోయారు. కూల్‌ డ్రింక్స్‌ కన్నా ప్రకృతి సిద్ధ పానీయాలు ఎంతో మేలన్నారు. ప్రతి ఒక్కరూ కూల్‌ డ్రింక్స్‌ కాకుండా సహజ పానీయాలైన కొబ్బరి నీళ్లు, చెరుకజూు, నిమ్మ, పండ్ల రసాలు తాగడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. అందరూ కలిసి ఒకచోట చేరి పండుగలు జరుపుకోవడం వల్ల మానవ సంబంధాలు మెరుగుపడతాయని చెప్పారు. నేటి ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీ పెరిగి ప్రపంచమంతా కుగ్రామంగా మారినా ప్రజలు మాత్రం ఒంటరి వారయ్యారని, సెల్‌ ఫోన్స్‌ మనుషులను ఏకాకిలను చేస్తున్నాయని చెప్పారు.జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోయ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. కూల్‌ డ్రింక్స్‌ వల్ల ఎలాంటి ఉపయోగాలూ లేవన్నారు. కూల్‌ డ్రింక్స్‌ పేరుతో కంపెనీలు వేల కోట్ల వ్యాపారాన్ని చేస్తున్నాయని, కానీ ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదన్నారు. లాభాలు పెంచుకునేందుకు కంపెనీలు సినిమా తారలతో వ్యాపార ప్రకటనలు ఇచ్చి అసత్య ప్రచారాలు ముమ్మరం చేస్తున్నాయని తెలిపారు. కోలా కంపెనీలకు లాభాలు తప్ప ప్రజల ఆరోగ్యం పట్టదన్నారు. అలాగే దేశంలో నీటిని ఈ కంపెనీలు విచ్చలవిడిగా వినియోగించుకుంటూ నీటి ఎద్దడికి కారణం అవుతున్నాయని చెప్పారు. మన దేశంలో కూల్‌ డ్రింక్స్‌లో అధిక శాతం ఫెర్టీసైడ్స్‌ కలుపుతున్నారని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా జేవీవీ ఇలా కూల్‌ డ్రింక్స్‌ అనర్థాలపై అవగాహన కల్పిస్తూ.. ఉగాది రోజున పచ్చడిని పంపిణీ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జేవీవీ రవ్‌ పురస్కరించుకుని మంగళవారం జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) హైదరాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎన్‌సీసీ గేటు వద్ద ఉగాది పచ్చడి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ.. దేశ ప్రజల ఆరోగ్యానికి శీతల పానీయాల రూపంలో పెనుముప్పు పొంచి ఉందన్నారు. పురుగుల మందుల తయారీలో వాడే రసాయనాలతో కూల్‌ డ్రింక్స్‌ తయారు చేస్తున్నారని చెప్పారు. వాటిని తాగితే ప్రజల ఆరోగ్యం పాడవుతుందన్నారు. గ్రామాల్లోనూ తాగునీరు లేకున్నా శీతల పానీయాలు మాత్రం పుష్కలంగా దొరుకు తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బులు చెల్లించి మరీ అనారోగ్యాన్ని కొనితెచ్చు కుంటు న్నామని వాపోయారు. కూల్‌ డ్రింక్స్‌ కన్నా ప్రకృతి సిద్ధ పానీయాలు ఎంతో మేలన్నారు. ప్రతి ఒక్కరూ కూల్‌ డ్రింక్స్‌ కాకుండా సహజ పానీయాలైన కొబ్బరి నీళ్లు, చెరుక