చల్లబడ్డ వాతావరణం..

నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని ఏజెన్సీలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మొన్నటి వరకు పగటి ఉష్ణోగ్రత 44 డిగ్రీల వరకు నమోదు కాగా శుక్రవారం 32, 33 డిగ్రీలకు పడిపోయింది. దీంతో ప్రజలు ఉపశమనం పొందారు. అక్కడక్కడ ఈదురు గాలులు వచ్చాయి. ఆకాశం మేఘమృతమై ఉరుములు మెరుపులు చోటుచేసుకున్నాయి. మరో రెండు మూడు రోజులు వాతావరణం ఇదేవిధంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. యాసింగు పంటలు పండించిన రైతులు జాగ్రత్త తీసుకోవాలని మండల అధికారులు సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఏజెన్సీలో వాతావరణం చల్లబడి ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు.