స్థానిక ఎలక్షన్ లకు సంపూర్ణంగా సహకరించండి 

Cooperate fully in local elections– డిఎల్ పి ఓ వెంకటేశ్వర్లు 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లో అన్ని పార్టీల నాయకులు సంపూర్ణంగా సహకరించాలని హుస్నాబాద్ డిఎల్ పీ ఓ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఓటర్ లిస్ట్ పై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుస్నాబాద్ మండలంలో 140 వర్డ్ లు ఉన్నాయని , వార్డులలో ఎలాంటి తప్పులు ఉన్న అభ్యంతరాలు చెప్పాలని తెలిపారు. ఇటీవల గ్రామంలోని వార్డుల వారిగా కుటుంబంలో ని అందరినీ ఒక్క దగ్గరకు తీసుకువచ్చేల ఓటర్ లిస్టును తయారు చేశామన్నారు. వార్డుల వారీగా ఉన్న ఓటర్ లిస్టును గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద నోటీస్ బోర్డ్ పై పబ్లిష్ చేసి ఉంచామన్నారు. ఎవరైనా ఓటర్ ఇలాంటి సమస్యనైన ,అభ్యంతరాలు ఉన్న అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈనెల 28 ఫైనల్ లిస్టు పబ్లిష్ చేస్తామని తెలిపారు. అభ్యంతరాలు వ్యక్తం చేసిన పార్టీల నాయకులు గ్రామాలలో వార్డ్ మెంబర్ కు నిలుచుంటే మా ఓట్లు మేమే వేసుకోలేక పోతున్నామని, ఓటర్ లిస్ట్ వార్డుల వారిగా చేయడంలో బిఎల్  ఓ లు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. గ్రామాలలో తప్పకుండా మరోసారి వార్డుల వారీగా ఓటర్ లిస్ట్ నమోదు పరిశీలించాలని పేర్కొన్నారు. మరోసారి గ్రామాలలో వార్డుల వారిగా తప్పులు లేకుండా చూసేలా చూస్తామని ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, డి ఎల్ పి ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ రమేష్, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు గంగం మధుసూదన్ రెడ్డి,బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎనగందుల శంకర్ , ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బోయిన సదన్ కుమార్, బహుజన్ సమాజ్ పార్టీ హుస్నాబాద్ మండల అధ్యక్షుడు దుండ్ర రాంబాబు, చెంచల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.