– గుండారం,గూడెం గ్రామాల్లో విక్షిత్ భారత్ కార్యక్రమం
– చర్చనీయాశంగా పలు శాఖల అధికారుల గైర్హాజర్
నవతెలంగాణ-బెజ్జంకి
ఆర్థిక, సామాజిక వృద్ధి,పర్యావరణ సుస్థిరతో పాటు సుపరిపాలన సహా అభివృద్ధి అంశాల దృష్టితో 2047 నాటికి ప్రపంచ దేశాల్లో భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి విక్షిత్ భారత్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందని.. అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అందరి సహకారమవసరమని సర్పంచ్ శెట్టి లావణ్య సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని గుండారం,గూడెం గ్రామాల్లో విక్షిత్ భారత్ కార్యక్రమాన్ని ఎల్ఈడీ స్క్రీన్ ద్వార గ్రామస్తులకు ప్రచారం నిర్వహించారు. విక్షిత్ భారత్ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులను కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం చేస్తుండగా ఆరోగ్య,వ్యవసాయ,బ్యాకింగ్ శాఖాధికారులు హజరై అయా శాఖల అధికారులు గైర్హాజరవ్వడం గ్రామంలో చర్రనీయాశంగా మారింది.ఎఈఓ శ్వేత,ఆరోగ్య కేంద్రం సూపర్ వైజర్ సులోచన, ఆరోగ్య మిత్ర రాజు,ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి రమేశ్, ఆశా కార్యకర్తలు భాగ్యలక్ష్మి, మాధవి, రజిత, ప్రే మలత గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రభుత్వ మందులతో వ్యాధిని జయించాడు
ప్రభుత్వం అందించిన మందులతో టీబీ వ్యాధి పూర్తిగ నయమైందని స్థానికుడు బాలయ్య అనందం వ్యక్తం చేశాడు. సుమారు 6 నెలల కాలానికి వైద్య సిబ్బంది అందించిన మందులతో వ్యాధిని పూర్తిగ జయించానని తెలిపారు. అనంతరం వైద్య సిబ్బందితో కలిసి సర్పంచ్ శెట్టి లావణ్య బాలయ్యను శాలువా కప్పి సన్మానించారు. వైద్య సేవలందించిన ఆరోగ్య కేంద్రం సిబ్బందికి, ప్రభుత్వానికి బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు.