తాడిచెర్ల , సహకార, రాజకీయం.?

– అవిశ్వాసాలపై  ఉత్కంఠ
– 26న ఛైర్మన్,28న వైస్ ఛైర్మన్ లపై తీర్మానాలు
– నెగ్గేది ఎవరో .?
నవతెలంగాణ – మల్హర్ రావు
గత నాలుగేళ్లుగా ఎప్పుడు వివాదాస్పదంగా కొనసాగుతున్న మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో మరోసారి తెరకెక్కింది. పిఏసీఎస్  సహ,కారం,లో రాజకీయం వేడెక్కింది. ఫిబ్రవరి 29న ఛైర్మన్,మార్చిన 1న వైస్ చైర్మన్ లపై సింగిల్ విండో డైరెక్టర్లు అవిశ్వాసాలు పోటాపోటీగా ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో  తీర్మానాలు ప్రవేశపెట్టడానికి అధికారులు తేదీలు ఖరారు చేశారు.దీంతో పీసీఎస్ చైర్మన్,వైస్ ఛైర్మన్ సీట్ల కోసం కాంగ్రెస్,బిఆర్ఏస్ పార్టీల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రస్తుత చైర్మన్ చెప్యాల రామారావు తనకున్న సభ్యులతో ఇప్పటికే ముందస్తుగా రహస్య క్యాంపుకు తరలించినట్లుగా తెలుస్తోంది.కాంగ్రెస్ నుంచి చైర్మన్ గా పోటీలో ఉన్న ప్రస్తుత సింగిల్ విండో డైరెక్టర్ ఇప్ప మొoడయ్య తన మద్దతు సభ్యులతో సన్నద్ధమైనట్లుగా తెలుస్తోంది.ఒక్కరోజు వ్యవధిలో చైర్మన్, వైస్ ఛైర్మన్ లపై అవిశ్వాసం పెట్టారు.
నెగ్గేది ఎవరో.?
పోటీపోటీగా సభ్యులు చైర్మన్, వైస్ ఛైర్మన్ లపై అవిశ్వాసాలు పెట్టడంతో ఈనెల 26న చైర్మన్ అవిశ్వాస తీర్మానం, 28న వైస్ ఛైర్మన్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టుగా అధికారులు ప్రకటించారు.తాడిచెర్ల ప్రాథమిక సహకార సంఘంలో అనూహ్యంగా చైర్మన్ చెప్యాల రామారావు,వైస్ ఛైర్మన్ మల్కా ప్రకాష్ రావు లపై సభ్యులు పోటాపోటీగా అవిశ్వాసాలు పెట్టారు.సంఘంలో 13 మంది సభ్యులు ఉండగా ఒక్కరూ ఇటీవల మృతి చెందారు.మిగిలిన 12 మందిలో ప్రస్తుత చైర్మన్ తరుపున 5గురు సభ్యులు క్యాంపులో ఉన్నారు.కాంగ్రెస్ వైపు ఏడుగురు సబ్యులు ఉన్నారు.అవిశ్వాసం నెగ్గాలంటే 9 మంది తప్పకుండా ఉండాలని తెలుస్తోంది..అవిశ్వాసం నెగ్గడం కోసం కాంగ్రేస్, బిఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ నెగ్గడం క్లిష్ట తరమే అనిపిస్తుంది ఎలాగైనా మంత్రి శ్రీదర్ బాబు సహకారంతో చైర్మన్ పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్ సభ్యులు వ్యూహంలో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.దీంతోపాటు వైస్ ఛైర్మన్ కు  సైతం సంఖ్య బలంగా తక్కువగా ఉందని తెలుస్తోంది. ఎలాగైనా పన్నాహం పొంది చైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఎత్తుగడలు వేస్తున్నట్లుగా సమాచారం.