పోలీసుల అదుపులో రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్స్ 

నవతెలంగాణ – గోవిందరావుపేట 
గాంధీభవన్ ముట్టడి పిలుపులో భాగంగా ముందస్తు చర్యగా పోలీసులు మండలానికి చెందిన రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లను గురువారం అదుపులోకి తీసుకున్నారు.రైతు రుణమాఫీ, రైతు భరోసా రైతాంగ సమస్యల పరిష్కారానికై  గాంధీ భవన్ ముట్టడి నేపథ్యంలో భాగంగా బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. శాంతి పద్ధతుల సమస్య కారణంగా పసర పోలీసులు   రైతు సమన్వయ సమితి కోర్డినేటర్స్ లను అదుపులోకి తీసుకొని ముందస్తుగా బండోవర్ చేశారు. వీరిలో సూడి పద్మరెడ్డీ రాంపూర్, కొలసని శ్రీనివాసరావు గోవిందరావు పేట, లావుడ్య వాగ లక్ష్మీపూర్, బండి రాజాశేఖర్ దుంపల్లిగుడెం, వంక లక్ష్మణ్ ముత్తాపూర్, అక్కేనపల్లి రమేష్ గోవిందరావు పేట కమిటీ ఉన్నారు.