రవిశంకర్ ప్రధాన పాత్రలో నిఖిల్, రాజశేఖర్, తేజ హీరోలుగా శ్రీమతి రాధా సురేష్ సమర్పణలో స్వశ్రీ క్రియేషన్స్- వాయుపుత్ర ఆర్ట్స్ బ్యానర్స్ పై యువ వ్యాపార వేత్త మాధవన్ సురేష్ నిర్మిస్తున్న చిత్రం ‘కాప్’. బి.సోముసుందరం దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఇటీవల తిరుపతి ఎస్‌వి ఇంజినీరింగ్ కాలేజ్‌లో వందలాదిమంది స్టూడెంట్స్ మధ్య వైభవంగా జరిగింది. జ్యోతి ప్రజ్వల అనంతరం ఎస్వీ కాలేజ్ డైరెక్టర్ డా.యన్. సుధాకర్ రెడ్డి స్వశ్రీ బ్యానర్ లోగోనీ ఆవిష్కరించారు. దర్శకుడు సోముసుందరం మట్లాడుతూ, ”శత్రుపురం, మన్యం రాజు’ చిత్రాల తర్వాత నేను డైరక్ట్ చేస్తున్న మూడవ చిత్రం ఇది. ట్రైలర్ అందరికీ నచ్చుతుంది. సినిమా కూడా ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుంది. ఈ వేసవిలోనే సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అని అన్నారు. సమర్పకురాలు రాధా సురేష్ మాట్లాడుతూ, ‘సోము కథ నాకు బాగా నచ్చింది. మా అబ్బాయి మాధవన్ సురేష్ నిర్మాతగా ఈ సినిమా స్టార్ట్ అయింది. అవుట్‌ఫుట్ చాలా బాగా వచ్చింది. సినిమాని ఆదరించి పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను’ అని చెప్పారు. నిర్మాత మాధవన్ సురేష్ మాట్లాడుతూ. ‘పొలిటికల్ సెటైర్స్‌తో పాటు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సమాజానికి ఉపయోగపడే ఒక మంచి సందేశంతో అందర్నీ ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా కూడా అదే రేంజ్‌లో ఉంటుంది’ అని తెలిపారు.