విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ చేసిన ప్రతినిదులు

నవతెలంగాణ – తాడ్వాయి 
విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రతినిధులు హేమంత్ కుమార్, నాగరాజు, రాజేందర్ లు తెలిపారు. తాడ్వాయి మండలం నందివాడ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రతినిధులు పదో తరగతి విద్యార్థులకు ప్యాడ్స పంపిణీ చేశారు ప్రతి విద్యార్థి కష్టపడి చదివితేనే దేశంలో ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని  తెలిపారు కృషి ఉంటేనే విజయం సొంతం అవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కృష్ణాకర్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, సరిత ,సంతోష్ ,దత్తాచారి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.