మహ్మదాపూర్ లో నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న పోలీసులు 

– 29 బ్యాగులు, రూ.35 లక్షల విలువ
– 1450 కేజీల నకిలీ పత్తి విత్తనల సీజ్ , ఇద్దరిపై కేసు నమోదు
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని  మహ్మదాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి ముక్కెర మల్లయ్య ఇంటిలో నకిలీ పత్తి విత్తనాలు ఉన్నాయని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ , హుస్నాబాద్ ఎస్ఐ మహేష్ సిబ్బందితో కలిసి నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు హుస్నాబాద్ ఎస్ఐ మాట్లాడుతూ హనుమకొండ జిల్లా వేలేరు గ్రామానికి చెందిన పిండి సురేష్ ,గాగిరెడ్డిపల్లి  గ్రామానికి చెందిన సతీష్ మహమ్మద్ పూర్ గ్రామంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి, ఎలాంటి కంపెనీ ప్యాకింగ్ లేకుండా 50 కేజీల బ్యాగులలో  29 సంచులను  1450 కేజీల నకిలీ పత్తి విత్తనలను నిల్వ ఉంచారు. హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, మండలాలలోని గ్రామాల రైతులకు మరి ఇతర జిల్లాలలోరైతులకు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. నమ్మదగిన సమాచారం మేరకు నకిలీ పత్తి విత్తనాలను  స్వాధీనం చేసుకొని హుస్నాబాద్ అగ్రికల్చర్ అధికారి ఇచ్చిన దరఖాస్తు పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం నకిలీ విత్తనాలపై పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన విత్తనాలు, కాలం చెల్లిన పురుగుమందులు, నకిలీ పురుగు మందులు అమ్మే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తరచుగా షాపులను తనిఖీ చేయడం జరుగుతుందని, రైతులను మోసం చేయాలని చూసే ప్రతి ఒక్కరిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండి వ్యవసాయ అధికారులు సూచించిన విత్తనాలు కొనుగోలు చేయాలని కోరారు. ఏ షాపులో కొన్న తప్పకుండా బిల్ తీసుకోవాలని సూచించారు. గ్రామాలలో విడి విత్తనాలు,   ఎక్కడైనా నకిలీ విత్తనాలు ఉన్నట్లు నకిలీ పురుగు మందులు కాలం చెల్లిన పురుగుమందులో విత్తనాలు   ఎవరైనా అమ్ముతున్నట్లు సమాచారం వస్తే  వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్  8712667447, 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.