మళ్లీ కరోనా విజృంభణ 24 గంటల్లో 12 మంది మృతి

మళ్లీ కరోనా విజృంభణ 24 గంటల్లో 12 మంది మృతిన్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 761 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే ఈ వైరస్‌ బారినపడి 12 మంది మృతి చెందారు. కేరళలో అయిదుగురు, కర్నాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 4,423 యాక్టివ్‌ కేసులున్నాయి. కాగా, దేశవ్యాప్తంగా కేరళలో 1,249, కర్నాటక 1,240, మహారాష్ట్ర 914, తమిళనాడు 190, చత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ 128 చొప్పున యాక్టివ్‌ కేసులు నమోదయ్యాయి.