– ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దాని విస్తృతమైన నెట్‌వర్క్ ద్వారా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క సమగ్ర పాలసీలను అందించనుంది
నవతెలంగాణ – హైదరాబాద్: ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మరియు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈరోజు కార్పొరేట్ ఏజెన్సీ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా వినియోగదారులకు విస్తృత శ్రేణిలో ఆర్థిక పరిష్కారాలను అందించాలనే లక్ష్యం దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు వేశాయి. ఈ ఒప్పందం, తమ ఉత్పత్తి శ్రేణిని విస్తరించడానికి , బ్యాంకింగ్ లేని, తగినంతగా బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని వారికి ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించాలనే నిబద్ధతను ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నొక్కి చెబుతుంది. ఈ భాగస్వామ్యం ద్వారా, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రత్యేకమైన మరియు వినూత్నమైన ఆరోగ్య బీమా పరిష్కారాలను తమ విస్తృత కస్టమర్ నెట్‌వర్క్‌కు అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ ఉత్పత్తులు ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఖాతాదారులకు చెందిన రిటైల్ మరియు గ్రూప్ విభాగాల అవసరాలు రెండింటినీ తీరుస్తాయి. ఈ భాగస్వామ్యం, బ్యాంక్ కస్టమర్‌లకు వారి ఆరోగ్య బీమా అవసరాల కోసం సమగ్ర పరిష్కారాన్ని అందిస్తుంది.
ఈ భాగస్వామ్యం పై ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఎండి & సీఈఓ, కె. పౌల్ థామస్ మాట్లాడుతూ.. ” కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య బీమా ఉండాల్సిన ఆవశ్యకత ను మేము ఈఎస్ఏఎఫ్ వద్ద ప్రచారం చేస్తున్నాము. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో మా భాగస్వామ్యం తరచుగా ఆరోగ్య సంక్షోభాలతో ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొనే వారికి ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా ఉంది. అందరికీ ఆరోగ్యకరమైన , మరింత సురక్షితమైన భవిష్యత్తును వాగ్దానం చేస్తుంది” అని అన్నారు. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎండి & సీఈఓ, అనూజ్ గులాటి మాట్లాడుతూ.. “భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన బ్యాంకులలో ఒకటైన ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో భాగస్వామ్యం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఇది ఆర్థిక చేరికలను ప్రోత్సహించడమే కాకుండా, నాణ్యమైన సర్వీసింగ్‌తో కూడిన సమగ్ర ఆరోగ్య బీమా పరిష్కారాలను తమ వినియోగదారులకు అందించడంలో కూడా ముందంజలో ఉంది” అని అన్నారు.