విద్యను కాషాయకరించి, అంగట్లో సరుకుగా మార్చిన కేంద్ర రాష్ట్ర,ప్రభుత్వాలు తమ విధానాన్ని మార్చుకోవాలని, అందరికీ సమానమైన నాణ్యతతో కూడిన ఉచిత విద్యను శాస్త్రీయంగా అందించాలని పీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నాగరాజు అన్నారు. విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసే విధానంలో భాగంగానే విద్యారంగ సమస్యలు పరిష్కరించడకుండ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నాయని ఆదివారం పిడిఎస్ఎఫ్ కార్యాలయంలో కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో పదేళ్లు గడిచిన విద్య ,ఉద్యోగాల కావాలన్న ఆకాంక్ష నెరవేరలేదన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా రంగాన్ని రక్షిస్తామని, ఫీజు నియంత్రణ చట్టం తీసుకువచ్చి, వ్యాపారాన్ని అడ్డుకుంటామని చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వ అండతోటి మాఫియాగా మారిన ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీని ఫలితంగా విద్యలో అసమానతలు పెరగడం మూలంగా పేదలు చదువులకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా విద్యా వ్యతిరేక విధానాలను మానుకోవాలని, కార్పొరేట్ విద్యాసంస్థలను పూర్తిగా రద్దుచేసి, ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రభుత్వ ఆదీనంలోకి తీసుకొని వ్యాపారాన్ని అడ్డుకోవాలి. విద్యారంగానికి సరిపడ నిధులు కేటాయించి కామన్ స్కూల్ విధానాన్ని తీసుకువచ్చి అందరికీ విద్యను అందించాలి. ఈ కార్యక్రమంలో నాయకులు కుమార్, రాజేందర్, నవీన్, నాగరాజు, అజయ్, నితీష్ లు పాల్గొన్నారు.