– బేయర్, అమెజాన్‌తో ఐకార్ ఒప్పందం: రద్దు చేయాలని కిసాన్ సభ డిమాండ్
న్యూఢిల్లీ : వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే చర్యలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముమ్మరంగా సాగిస్తోంది. మూడు చట్టా లు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌కు ధారాదత్తం చేసేందుకు మోడీ సర్కార్ చేసిన కుట్రను మహత్తర రైతాంగ ఉద్యమంతో అన్నదాతలు తిప్పి కొట్టిన నేపథ్యంలో దొడ్డిదారి మార్గాలను కేంద్రం అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా బేయర్, అమెజాన్ కిసాన్ వంటి కార్పొరేట్ దిగ్గజ కంపెనీలతో భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఇటీవల పలు అవగాహనా ఒప్పందాలు (ఎంఓయూ)ను కుదు ర్చుకుంది. వ్యవసాయ పరిశోధన రంగాన్ని, మార్కె టింగ్‌ను గంపగుత్తగా కంపెనీలకు అప్పగించడాన్ని తక్షణమే ఉపసంహరించు కోవాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) డిమాండ్ చేసింది. రైతులను నిలువునా దోపిడీ చేసేందుకు అనుకూలమైన వాతా వరణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా బడా వాణిజ్య సంస్థలకు లాభాలు ఆర్జించేందుకు మోడీ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తోందని విమర్శించింది.
ఇటీవల ఐసీఏఆర్, బేయర్ (వ్యవసాయ రంగంలో బహుళజాతి బడా వాణిజ్య సంస్థ) మధ్య కుదిరిన ఎంఓయూలో ఈ విషయం స్పష్టమవుతోందని తెలిపింది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించే ప్రయత్నాలను ప్రతిఘటించాలని ఏఐకేఎస్ ప్రజలను కోరింది. ఈ ఎంఓయును ఫలితంగా ఏర్పడనున్న వ్యవస్థాగత భాగస్వామ్యాన్ని చిన్న కమతాల రైతులకు సాధికారత కల్పించేందుకు జరిగిన ప్రయత్నమంటూ ఐసీఏఆర్ ఒక బూటకపు కథనాన్ని సృష్టిస్తోందని ఏఐకేఎస్ విమర్శించింది. పంటలు, రకాలు, పంటల రక్షణ, కలుపు, యాంత్రీకరణ కోసం సమర్ధవంతమైన వనరులు , వాతావరణ పరిస్థితులకు సరిపోయే పరిష్కారాలను అభివృద్ధిపరచడం కోసం బేయర్‌తో ఒప్పందం కుదు ర్చుకున్నట్టు ఎంఓయూ పేర్కొంటోంది. అంతకు ముందు దానిమ్మ పంట సాగుపై కూడా ఐసీఏఆర్, బేయర్ మధ్య ఇలాంటి పరిశోధనా సహకార ఒప్పందం కుదిరింది. ఇటువంటి ఎంఓయూలు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలించి చూసి నట్లైతే, ఐసిఎఆర్‌కు గల విశ్వసనీయత, నెట్ వర్క్, వనరులను ఇందుకోసం ఉపయోగించడం ద్వారా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలోకి కార్పొరేట్ కోరలను చొప్పించేందుకు ఉద్దేశించిన ప్రయత్నంగా కనిపిస్తో ందని ఏఐకేఎస్ విమర్శించింది. కార్పొరేట్ లాభాలను గరిష్ట స్థాయికి పెంచేందుకు దొడ్డిదారిన కార్పొరేట్ అనుకూల నిరంకుశ వ్యవసాయ చట్టాలను తీసుకు రావడానికి ఇదొక ప్రయత్నమని విమర్శించింది.
ఈ కార్పొరేట్ సంస్థలు, ఐసీఏఆర్‌తో ఇటువంటి సహ కార ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల అపార అవ కాశాలు వస్తాయని, వాటితో చట్టబద్ధతను తెచ్చుకుం టారని, తద్వారా లాభాలు గడించేందుకు పెద్ద మార్కెట్‌ను ఏర్పాటు చేసుకుంటారని ఏఐకేఎస్ పేర్కొంది. అన్ని కార్పొరేట్ సంస్థలతో ఐసీఏఆర్ సంతకాలు చేసిన అవగాహనా ఒప్పందాలను కేంద్రం తక్షణమే రద్దు చేయాలని ఎఐకెఎస్ డిమాండ్ చేసింది. తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వ వనరులను, సంస్థలను వాడుకోవడాన్ని నివారించా లని కోరింది. దానికి బదులుగా ఈనాడు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొ నడానికి గానూ వ్యవసాయ పరిశోధనలకు ప్రభుత్వ నిధులను, వనరులను పెంచాలని ఏఐకేఎస్ కోరింది. రైతాంగం, శాస్త్రవేత్తలు, మేథావులు వెలిబుచ్చుతున్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించే ప్రయత్నాలన్ని ంటినీ నిర్ద్వంద్వంగా ప్రతిఘటించాలని కోరింది.