ఎంపీ కనుగైగల్లోనే వ్యవసాయ సహకార సంఘంలో అవినీతి

– అవినీతికి అడ్డగా మారిన దుబ్బాక వ్యవసాయ సహకార సంఘం 

– అవినీతిలో ఎంపికి ,ఎమ్మెల్యేకు వాటాలు 
– పూర్తి ఆధారాలతో వాస్తవాలు త్వరలో బయట పెడుతాం 
– సిద్దిపేట డిసిసి కార్యదర్శి ఏలూరి సంచలన ఆరోపణలు
నవతెలంగాణ-దుబ్బాక రూరల్ 
దుబ్బాక వ్యవసాయ సహకార సంఘంలో జరిగిన అవినీతి అక్రమాలకు ఎంపీ, ఎమ్మెల్యేలకు వాట ఉందని, 40 లక్షల అవినీతిలో పథకం ప్రకారం చిరు ఉద్యోగినీ ఇరికించి అసలు దొంగలు భయట దర్జాగా తిరుగుతుంటే… సంబంధిత విచారణ అధికారులు ఇంకా ఎంత కాలం సమయం వృధా చేసి… అసలు దొంగలను ఎప్పుడు పెట్టుకుంటారో చెప్పాలని  డిసిసి సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్ డిమాండ్ చేశారు. సోమవారం దుబ్బాక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.దుబ్బాక సహాకార సంఘంలో 40 లక్షల అవీనీతీ జరిగిందని, 2022 లో సహకార సంఘంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీనివాస రెడ్డి విచారణ జరుపగా 40 లక్షల అవీనీతీ జరిగిందని పాలకవర్గం అంగీకరించిందని పేర్కొన్నారు.
 తూతు మంత్రంగా చిరు ఉద్యోగి (సీఈవో)
లక్ష్మారెడ్డి ని తొలగించి చేతులు దులుపుకున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ అవీనీతిలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావుకు భాగస్వామ్యం ఉన్నాయని ఏలూరి కమలాకర్ ఆరోపించారు. రైతులకు అమ్మాల్సిన ఎరువుల పై  బ్లాక్ దందా చేశారని,ఎవరి ద్వారా చేశారో త్వరలో బయట పెడతానని హెచ్చరించారు. చివరకు రైతులు చెల్లించిన ఋణాలను జమ చేయకుండ ఎవరూ కాజేశారని తెలుసన్నారు.
        దుబ్బాక వ్యవసాయ సహకార సంఘ పాలకవర్గాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. జవాబుదారీతనం, పారదర్శకతగా వ్యవహరిస్తున్నమన్న పాలకులను
డబ్బులు ఏటు వెళ్లాయో చెప్పాలని ప్రశ్నించారు. ఉమ్మడి దుబ్బాక మండలంలో 38 గ్రామాల రైతులకు విత్తనాలు, ఎరువులు అందించే ఈ సహకార సంఘంలో జరిగిన అవినీతినీ పూర్తీ స్థాయిలో ఆధారాలతో ప్రజలకు, మీడియాకు అందిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సంజీవ రెడ్డి బొంగరం బాల్ రెడ్డి. బెల్లి బాల్ నర్సింలు.పార్శారములు సిద్దిరాములు. కిషోర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.