అవినీతి అనేది కనిపించవద్దు, వినిపించవద్దు: ఎమ్మెల్యే

– సామాన్యులు ఇస్తున్న దరఖాస్తులపై సమగ్ర విచారణ
– ప్రజా పాలనలో ప్రతి ఒక్కరికి న్యాయం
– పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే  యశస్విని రెడ్డి
నవతెలంగాణ – రాయపర్తి
పాలకుర్తి నియోజకవర్గంలో అవినీతి అనేది కనిపించవద్దు వినిపించవద్దు అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. బుధవారం మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని మండలంలోని రాగన్నగూడెం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఇస్తున్న ప్రతి దరఖాస్తుపై సమగ్ర విచారణ చేపట్టడం జరుగుతుంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సామాన్యులకు న్యాయం జరుగుతుంది అన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి అని ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మూత పడగ వెంటనే తెరవాలని విద్య శాఖ అధికారులకు హుకుం జారీ చేశారు. తదుపరి గ్రామంలో మొక్కలు నాటారు. గ్రామ శివారులోని వనం వారి మాటును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ రామ్మోహన్, బ్లాక్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా  నాయక్, మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు కృష్ణమాచార్యులు, మహేందర్ రెడ్డి, మాచర్ల ప్రభాకర్, సరికొండ కృష్ణారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఎసి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కుందూరు రామ్ రెడ్డి, ఉల్లంగల నర్సయ్య, ఉల్లంగల యాదగిరి, ముద్రబోయిన వెంకన్న, సుదర్శన్ రెడ్డి, ఈరెడ్డి నరసింహారెడ్డి, గూగులోతు శీను, చిన్నపాక ఎల్లయ్య, చిర్ర మల్లయ్య, భూక్య సమ్మయ్య,  నరసింహమూర్తి, ఎండి ఉస్మాన్, జలగం యాకయ్య, సుధాగాని వెంకటేశ్వర్లు, పిరని ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.