హైదరాబాద్ : కాస్ట్యూమ్స్ అండ్ ఫ్యాషన్ అవార్డ్స్ (సీఎఫ్‌ఏ) 2024ని నవంబర్ 30, డిసెంబర్ 1న నిర్వహించనున్నట్టు ఆర్‌వీ వల్లభనేని స్టూడియోస్ తెలిపింది. నగరంలోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం నిర్వాహకులు ఆవిష్కరించారు. ఇది టాలీవుడ్ సినిమా వైభవానికి తోడ్పడుతున్న సాంకేతిక నిపుణులు, కాస్ట్యూమ్ డిజైనర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నమని వల్లభనేని స్టూడియోస్ ప్రతినిధులు వల్లభనేని గోపీచంద్, అరుణ శ్రీ సుకల తెలిపారు. దక్షిణ భారతదేశంలో భారీ స్థాయిలో నిర్వహించబోతున్న తొలి అవార్డుల వేడుక ఇదేనని పేర్కొన్నారు.