రేపు యధావిధిగా పత్తి కొనుగోళ్లు

Cotton purchases as usual tomorrowనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో రెండవ శనివారం ఈనెల 9వ తేదీన కూడా యధావిధిగా పత్తి కొనుగోళ్ల ప్రక్రియ జరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పత్తి కోనుగోలు సీసీఐ, ప్రైవేట్ ద్వారా యదావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. రెైతులు శనివారం కూడా తమ పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కావున జిల్లాలోని పత్తి రైతులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.