పత్తి కొనుగోళ్లను కొనసాగించాలి

– సీసీఐకి మంత్రి తుమ్మల విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలోని పత్తి కొనుగోళ్లను కొనసాగించాలని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు వ్యవసాయ, మార్కెటింగ్‌, శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు విజ్ఞప్తి చేశారు. 2023లో రాష్ట్రంలో 44.92 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, 25.02 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి రాగలదని అంచనా వేసినట్టు తెలిపారు. తదను గుణంగా కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో, 285 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ 8,569.13 కోట్లను వెచ్చించి 12.31 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తిని దాదాపు 5,36,292 రైతుల వద్ద నుండి సేకరించిందని పేర్కొన్నారు. ప్రయివేటు వ్యాపారుల ద్వారా మరో 4.97 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించినట్టు తెలి పారు. ఇంకా కొన్ని జిల్లాల్లో పత్తి మూడో సారి ఏరివేత దశలో ఉండగా కొన్ని ప్రాంతాల్లో రైతుల వద్ద మొదట, రెండో సారి తీసిన పత్తిని దాదాపు 71 లక్షల క్వింటాల వరకు ఉంటుందని అంచనా ఉందని తెలిపారు. వారం రోజులుగా ప్రపంచ మార్కెట్‌లో కూడ పత్తికి డిమాండ్‌ పెరిగిన సందర్బా న్ని గుర్తు చేస్తూ కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కూడా కొనుగోళ్లను నిరాటంకంగా వేగం గా కొనసాగించా లని కోరారు.సీసీీఐ కొనుగోళ్ల నుంచి తప్పుకుంటే మార్కెట్‌లో ధరలు తగ్గే ప్రమాద ముందనీ, దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి, పత్తి రైతులకు నష్టం జరుగు తుందని పేర్కొన్నారు. ఒకటి రెండు సందర్భాల్లో పత్తి నాణ్యతా ప్రమాణాలకు తగట్టుగా రాకపోతే సీసీఐ ప్రమాణాల ప్రకారమే ధరలు నిర్ణయించి కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేవారు.