కుష్టి వ్యాధిపై అవగాహన, ప్రతిజ్ఞ..

Awareness and pledge on leprosy..నవతెలంగాణ – రెంజల్ 
మహాత్మా గాంధీ కలలుగన్న భారతదేశంలో కుష్టి వ్యాధి రహిత భారతదేశ నిర్మాణంలో అందరితో కలిసి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని అధికారులు, వైద్య అధికారులు, వైద్య సిబ్బంది గురువారం కూనేపల్లి గ్రామంలో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా సొంత కుటుంబంగా భావించి వారికి నేను ప్రేమతో చికిత్స చేయిస్తానని, ఏ విధమైన వివక్ష చూపకుండా ప్రేమ భావంతో వారి ఆత్మ గౌరవాన్ని కాపాడుతమని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినయ్ కుమార్, ఎంఆర్ఐ రవికుమార్, హెచ్ ఈ వోలు కరిపే రవీందర్, శ్రావణ్ కుమార్, గ్రామ పెద్దలు, ఆశ వర్కర్లు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.