– బీజేపీ మంత్రులపై జగ్గారెడ్డి ఫైర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్టుమెంట్ రిజియన్ (ఐటీఐఆర్)కు గత యూపీఏ ప్రభుత్వం అనుమతి ఇస్తే… నేటి బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందనీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. బీజేపీ మంత్రులు దాన్ని అడ్డుకోలేకపోయారని ఫైరయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఐటీఐఆర్‌ను రద్దు చేస్తే కనీసం చర్చ కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతల ప్రసంగాల్లో రెచ్చగొట్టే అంశాలే తప్ప ఉపాధి, ఉద్యోగాలపై చర్చలేదన్నారు.