కమీషనర్ ను కలిసిన కౌన్సిలర్ నాగరాణి విక్రమ్

నవతెలంగాణ – నాగార్జునసాగర్
నందికొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన డి.శ్రీనివాస్ ను 6వ వార్డు కౌన్సిలర్ ఆదాసు నాగరాణి విక్రమ్ బుధవారం మున్సిపల్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వార్డులో నెలకొన్న పలు సమస్యలైన ఎస్సి/ఎస్టీ సబ్ ప్లాన్, నిధులు మంజూరై పూర్తి కానీ సీసీ రోడ్ల నిర్మాణం,అదేవిధంగా హిల్ కాలనీలోని  బస్టాండ్ మరమ్మతులు, బస్టాండ్ లోని మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, రాత్రి సమయంలో వీధిలైట్లు వెలగటం లేదని,బస్టాండ్ లో బస్సులు తిరిగే విధంగా చూడాలని మరి కొన్ని సమస్యల పైన కమిషనర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వీరితో పాటు ఎస్.సి సెల్ జిల్లా నాయకులు ఆదాసు విక్రమ్ పాల్గొన్నారు.