
భువనగిరి పట్టణ 23వ వార్డులో కమ్యూనిటీ హాల్ వద్ద తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలలో భాగంగా ఫిబ్రవరి నెలలో మరో రెండు గ్యారెంటీలు గృహ జ్యోతి పథకం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహా లక్ష్మి పథకం రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు పరుస్తామని చెప్పడంతో విద్యుత్ అధికారులుతో, మున్సిపల్ అధికారులతో స్థానిక కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ ఆధ్వర్యంలో క్యాంప్ ఏర్పాటు చేశారు. వార్డు ప్రజలతో రెండు పథకాలు కావాల్సిన కరెంట్ మీటర్ రీడర్ రీడింగ్ బిల్, గ్యాస్ సిలిండర్ సంబంధించిన సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలను ప్రజలతో అధికారులకు అందించారు. ఈసందర్భంగా కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో భాగంగా ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా 6 గ్యారంటీ పథకాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అండగా ఉన్నారో ,రానున్న పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు హరి సింగ్,రమణి ,మున్సిపల్ అధికారులు పొట్ట శ్రీనివాస్ వార్డు నాయకులు గోపే బాబు, బర్రె క్రాంతి, కోళ్ల విశ్వనాథం, పాల్గొన్నారు.