
నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లోని మూడో వార్డు లో గల అంగనవాడి కేంద్రంలో 3వ తేదీ ఆదివారం నాడు చేపట్టబోయే పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ వార్డు కౌన్సిలర్ నాగ శిరీష మోహన్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అప్పుడే పుట్టిన పిల్లల నుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లలు గల తల్లిదండ్రులందరు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని, వారిని అంగవైకల్యం బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉందని సూచించారు. ఈ సదవకాశాన్ని మున్సిపాలిటీ ప్రజలు ముఖ్యంగా వార్డు సభ్యులు వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.