మెండోర మండలంలో పలు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం పరామర్శించారు.మెండోర మండల కేంద్రానికి చెందిన మాకురి వినోద్ గల్ఫ్ దేశం బహరైన్ లో రెండు రోజుల క్రితం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృత దేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వం తరుపున ప్రయత్నం చేస్తామని తెలిపారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం కల్పించారు.మండల కేంద్రానికే చెందిన వడ్ల రవి క్యాన్సర్ తో మరణించారు. అదేవిధంగా మంగలి రాజు వాళ్ళ అమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఇరువురి కుటుంబాల సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. వెల్కటూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త అనంత్ వాళ్ళ అమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.