మండల కేంద్రానికి చెందిన డిస్కో నరసయ్య కుటుంబ సభ్యులను బుధవారం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. నరసయ్య ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ముత్యాల సునీల్ కుమార్ వారి కుటుంబ సభ్యులు పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. అనంతరం మండలంలోని హాసకొత్తూర్ గ్రామానికి చెందిన కిషన్ గౌడ్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, నాయకులు నిమ్మ రాజేంద్రప్రసాద్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్దుల్ రఫీ, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు