– కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి సైకియాట్రిస్ట్ డాక్టర్ నివేదిత
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
మద్యానికి బానిసైన వారికి కౌన్సెలింగ్ అందించి వారిలో మార్పును తీసుకు వస్తున్నామని కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రి సైకియాట్రిస్ట్ డాక్టర్ నివేదిత అన్నారు. శుక్రవారం ఆమె చాంబర్ మాట్లాడుతూ.. ఆల్కహాల్ (మద్యం, మందు కల్లు) సేవించడం వల్ల జ్ఞాపకశక్తి కోల్పోతారని తెలిపారు. మద్యం సేవించిన వారిలో ఎముకలు బలహీనపడడం, రక్త విరోచనాలు, గుండె జబ్బులు, ఊపితిలు దెబ్బతినడం, పెరాలసిస్ లాంటి వ్యాధులు వస్తాయన్నారు. మద్యానికి బానిస కాకూడదని ప్రజలకు సూచించారు. ఇప్పుడు ఎక్కువగా మందు కల్లు సేవించి దానికి బానిసై మానలేక తీవ్ర మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళ రోగులు ఎక్కువగా వస్తున్నారని తెలిపారు. స్త్రీలు గర్భంతో ఉన్నప్పుడు మందు కల్లు , మద్యం సేవించడం వల్ల అది నేరుగా బిడ్డా ఫై ప్రభావం పడి బిడ్డ బలహీనంగా, బుద్ధిమద్యం, ఎదుగుదల లోపం ఉంటుందన్నారు. మద్యాన్ని సడన్ గా మానేయడం వల్ల కూడా పిడుసు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి వారికి కుటుంబం అండగా నిలవాలని కోరారు. తమ వద్దకు వచ్చిన రోగులకు కౌన్సిలింగ్ నిర్వహించి, వారికి మందులను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ పోషకాలతో కూడిన బలమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. వైద్యని సలహాలు పాటిస్తూ పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని కోరారు. ఇప్పటివరకు 80 శాతం మధ్యాహ్నానికి బానిసై మానసిక రుగ్మతులతో తమ వద్దకు వస్తున్న రోగులను పరీక్షించి మందులను అందిస్తున్నామన్నారు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలని ప్రజలకు సూచించారు.