
2024-25 విద్యా సంవత్సరానికి గాను మిర్యాలగూడలో గల అవంతిపురం గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలాల్లో( సి ఓ ఈ)స్పాట్ అడ్మిషన్ల కోసం ఈనెల 25న సంప్రదించాలని తుంగతుర్తి గిరిజన సంక్షేమ కళాశాల ప్రిన్సిపాల్ నీలారాణి ఓ ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు గిరిజన సంక్షేమ పాఠశాలలో చదివి పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులతో పాటు,ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎస్సీ,ఎస్టీ,బీసీ,ఓసి విద్యార్థులకు పదవ తరగతిలో సాధించిన జిపిఏ ప్రాతిపదికన అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కౌన్సిలింగ్ కు హాజరు కాదలచిన విద్యార్థులు తమ తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు,రెండు సెట్ల జిరాక్స్ కాపీలు,4 పాస్ ఫోటోలు తీసుకొని ఉదయం 9 గంటల వరకు రావాలని సూచించారు.ఎంపీసీ,బైపిసి,సిఇసి గ్రూపులలో గల కాళీ సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ జరుగుతుందని తెలిపారు.