మండలంలోని గంట్లకుంట గ్రామానికి చెందిన కన్నె సోమక్క (62) వృద్ధాప్యం బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, మృతురాలి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఆయన వెంట మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, ,మండల సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ ఎరుకల సమ్మయ్య గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు ముత్తినేని సోమన్న, గౌరవ అధ్యక్షుడు ఎండీ ముక్తర్ పాషా, బందు వెంకన్న, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కన్నె సంతోష్, వినోద్, పవన్, నర్సయ్య తదితరులు ఉన్నారు.