బాధిత కుటుంబానికి పరామర్శ 

Counseling the victim's familyనవతెలంగాణ – పెద్దవంగర
మండలంలోని రెడ్డికుంట తండాకు చెందిన బానోత్ రంగమ్మ (78) వృద్ధాప్యం తో మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య పార్టీ నాయకులతో కలిసి మృతురాలి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్, సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్, నాయకులు పసులేటి వెంకట్రామయ్య, ఆంగోత్ సిత్య నాయక్, బానోత్ సోమన్న నాయక్, రెడ్డబోయిన గంగాధర్, మాజీ సర్పంచ్ దంతాలపల్లి సాయిలు, గిరగాని రవి, బానోత్ రాకేష్ తదితరులు ఉన్నారు.