బాధిత కుటుంబానికి పరామర్శ 

నవతెలంగాణ – పెద్దవంగర: మండలంలోని టిక్య తండాకు చెందిన శతాధిక వృద్ధురాలు బానోత్ కమలమ్మ గురువారం మృతి చెందింది. వృద్ధురాలి మృతదేహానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్, మాజీ సర్పంచ్ భీమా నాయక్, నాయకులు జాటోత్ శ్రీను, జాటోత్ రవి, బానోత్ రాములు, కిషన్, గోపి, నెహ్రూ గణేష్ తదితరులు పాల్గొన్నారు.