కల్వకుంట్ల స్కామిలీకి కౌంట్‌ డౌన్‌

– నియంత సర్కారుకు రాస్తున్న మరణశాసనం : రేవంత్‌ రెడ్డి ట్వీట్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్‌ రెడ్డి కల్వకుంట్ల స్కామిలీకి కౌంట్‌డౌన్‌ పేరుతో ట్వీట్‌ చేశారు. ”ఇది.. దగాపడిన యువత, ఆగమైన అన్నదాత కన్నెర్ర చేస్తూ చెప్తున్న కౌంట్‌ డౌన్‌. ఇది.. మోసపోయిన దళితుడు, రక్షణ లేని ఆడకూతురు చెప్తున్న కౌంట్‌ డౌన్‌. ఇది.. కన్నీళ్లు పెట్టిన సర్కారు బడి చిన్నారి, పింఛన్‌ కోసం కాళ్లరిగేలా తిరిగిన పెద్ద మనిషి చేస్తున్న కౌంట్‌ డౌన్‌. ఇది.. నిలువ నీడ లేని పేద కుటుంబం, మాట్లాడే స్వేచ్ఛలేని మేధావి వర్గం నినదిస్తున్న కౌంట్‌ డౌన్‌. ఈ 52 రోజుల కౌంట్‌ డౌన్‌.. నాలుగు కోట్ల ప్రజలు మీ నియంత సర్కారుకు రాస్తున్న మరణశాసనం.. ” అని రేవంత్‌ పేర్కొన్నారు.