కొత్త బాటకు ఎదురు దెబ్బలు

కొత్త బాటకు ఎదురు దెబ్బలునేనో కాలిబాటన నడుస్తూన్న
అతి సహజంగా అదే బాటన
పసి సమూహాలు రాబోతున్నాయి
నా కళ్ళముందే ముళ్ళకంపలు
పరుస్తూ పోతున్నాయి మధవీలతలు కొన్ని
సంఘీయ సమూహలమై గుచ్చే ముళ్ళనేరి
చూపుడు వేళ్ళను నాటుదాం రండి
తప్పుకు పోతున్న ఉత్తములారా పిలిచాను
తొలగించడం ప్రేమగా చేస్తున్నా
ఎవరి అహాలను తప్తి పరచడం నా పనికాదన్నా
నీవొక్క వేలితో చూపుతే
నాలుగు ముఖాల నలబైవేల వేళ్ళతో
వేధిస్తాం అన్నారు వాళ్ళు
మనమంతా ఒకచేతి ఐదువేళ్ళం
పిడికిలి బిగించే అమ్మలం కదా..
కాదు నువ్వు ఎడం చెయ్యి మేము కుడిచేతులం
నీది బొట్టు లేని ముఖం
కులం మతం లేని నువ్వు
మనిషివే కాదన్నారు వాళ్ళు
కొత్త బాటకు ఎదురు దెబ్బలు
మామూలే అన్నా నేను.
– జ్వలిత, 9989198943