రేపు మేడారం హుండీల లెక్కింపు..

నవతెలంగాణ – తాడ్వాయి 
మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల హుండీలను రేపు గురువారం లెక్కింపు ప్రారంభించనునట్లు మేడారం ఈవో రాజేంద్రం తెలిపారు. పూజారులు, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారుల భారీ బందోబస్తు నడుమ మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయం ఆవరణలో హుండీల లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపారు.