దుండగులు దాడిలో దంపతులకు గాయాలు

Couple injured in thug attackనవతెలంగాణ – అశ్వారావుపేట
ఒక ఇంట్లో చోరీ కి పాల్పడ్డ దుండగులు దంపతులపై దాడికి పాల్పడి బంగారు ఆభరణం దోచుకుని వెళ్ళారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని నారంవారిగూడెం కాలనీలో తుమ్మలపల్లి సూర్యనారాయణ ఇంట్లోకి మంగళవారం అర్ధరాత్రి  2 గంటల సమయంలో ఇద్దరు దొంగలు దొరబడ్డారు.ఇంట్లో నిద్రిస్తున్న సూర్యనారాయణ పై దుండగులు దాడి చేస్తుంటే కళావతి కేకలు చేసింది. ఆమెపై నా దాడి చేసి మెడలో ఉన్న 2 కాసులు బంగారు పుస్తెలు తాడును ఎత్తుకెళ్లారు. స్థానికుల సహాకారంతో దాడిలో గాయపడ్డ సూర్యనారాయణ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై శివరామకృష్ణ తెలిపారు.