Why me? Why Only me? The One question which is the root cause of suffering? అందరికీ నమస్కారం. గత వారం మనం మనలోని బలాన్ని ఎలా గుర్తించాలో, భయాన్ని ఎలా జయించాలో చర్చించాం కదా! ఈ వారం మనందరిలో బాధకు, లో గా ఫీలవ్వడానికి కారణం గురించి చర్చిద్దాం. సాధారణంగా సమాజంలో మహిళలే ఎక్కువగా ఏమీ సాధించలేక పోతున్నామని బాధపడుతుంటారు. కుటుంబంలో అందరికీ అన్నీ సమకూర్చుతూనే మనసువిప్పి మాట్లాడేవారు లేక తమలో తామే కుంగిపోతుంటారు. నాకే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయని మదనపడుతుంటారు. ఈ బాధను ఎలా జయించాలో తెలుసుకుందాం…
జీవితంలో మనందరం ఎన్నో కష్టాలను, ఛాలెంజెస్‌ని ఎదుర్కొంటాం. ఎదుర్కొంటూనే ఉంటాము. ఇది నిరంతర ప్రాయణం, సాధన. మనందరం గ్రహించాల్సిన విషయం ఒకటుంది. సృష్టిలో వెలుగు నీడలు, సూర్య చంద్రులు, వేసవి, శీతాకాలం, నీడ, ఎండ, నలుపు, తెలుపు… ఇలాంటివన్నీ నిరంతరం మనకు ఒకటి గుర్తు చేస్తూ ఉంటాయి. అదేమిటంటే వీటన్నింటిలాగే జీవితంలో సుఖం, దు:ఖం కూడా ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉంటాయని. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని. ఈ వాస్తవాన్ని మనం పూర్తిగా గ్రహించి ప్రతి రోజూ స్మరణ చేసుకోవాలి. అప్పుడే ఒక పాజిటివ్ దృక్పధంతో జీవితాన్ని చూడడం మొదలవుతుంది. ఇది ఎంతో అవసరం.
మనో ధైర్యం
మనం జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి, మరొకటి అలా నిరంతరం కష్టాలు అనుభవిస్తున్నపుడు, అసలు ఏం చేయాలో దారి కనిపించనపుడు ఈ ఫేస్‌ని ని Hitting the rock bottom” అంటాము. అయితే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనపుడు మనకు అత్యంత అవసరమైన ఆయుధం ఒకటి ఉంది. అదే ‘మనో ధైర్యం’. ఈ సందర్భంలో మీ అందరికీ ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి ఒక రాజుకు లక్ష్మీదేవి ప్రత్యక్షమయి ‘నీకు అష్టలక్ష్ములలో ఒకరిని మాత్రమే ప్రసన్నం చేసుకునే వరం ఇస్తున్నాను. నీకు అష్టలక్ష్ములలో ఎవరు ప్రసన్నం కావాలో కోరుకో’ అని వర మిచ్చింది. దానికి ఆ రాజు ‘నాకు ధైర్య లక్ష్మి ఎప్పుడూ తోడుగా ఉండేటట్లు వరమివ్వు’ అని కోరుకున్నాడు. దేవత అదేమిటి ధనలక్ష్మీ, ధాన్యలక్ష్మీ ఇలా అందరినీ వదిలిపెట్టి ధైర్యలక్ష్మిని ఎంచుకున్నావు అనగా దానికి ఆ రాజు ‘తల్లీ మనం జీవితంలో ధైర్యాన్ని కోల్పోతే సర్వం కోల్పోతాము. అడుగు ముందుకు వేయలేము. అదే ధైర్యంగా ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొంటాము. స్థిత ప్రజ్ఞతతో సమస్యలకు పరిష్కారం వెతుకుతాము. సమస్య నుండి బయటపడి విజయాన్ని సాధిస్తాము. పురోగతి చెందుతాము. అందుకే ధైర్య లక్ష్మి వెంట ఉంటే అందరూ లక్ష్మీదేవతను ప్రసన్నం చేసుకోగలుగుతాము’ అని సమాధానం ఇచ్చాడు. మీకు సరళంగా అర్థం కావాలని ఈ కథను ఉదాహరణగా ప్రస్తావించాను. సైంటిఫిక్ రీసెర్చ్ ఎండ్ ఎవిడెన్స్ ప్రకారం కూడా ఇతరులతో పోలిస్తే మనో ధైర్యంతో ఉన్నవారు సమస్యలను కొంత సులువుగా ఎదుర్కొంటారు. పరిష్కారం కోసం అన్వేషించి బయటపడతారు.
సమస్యలకు బెదిరిపోకుండా…
ఈ చిన్న కథ సారాంశం ఏమిటంటే జీవితంలో ఎటువంటి పరిస్థితిలో అయినా ధైర్యంగా ఉండటం ఎంతో అవసరం. ధైర్యంగా ఉంటే స్థిత ప్రజ్ఞత వస్తుంది. ఇలా ఆలోచించడం వల్ల సమస్యను చూసి బెదిరిపోకుండా సమస్య నుండి బయట పడటానికి దారులు వెతుకుతాము. కార్య సాధకులుగా మారుతాము. విజయాన్ని పొందుతాము. ఒక్కో కష్టం అధిగమిస్తూ పరిణితి పొందుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ అందరికీ స్ఫూర్తిదాతగా మారుతాము.Post Traumatic stress ని చక్కగా handle చేసి Post traumatic growth ని చవిచూస్తాము. Friends అవుతూ ముందుకు సాగుతాము. అంతే కదా ఖీతీఱవఅసర ఈ జీవితంలో ధైర్యం మనకు ముఖ్యమైన రక్షణ కవచం, ఆయుధం.
When we are in a dark tunnel and there is no light, keep moving with hope and faith à there is light always at the end of tunnel.
ఓ ప్రశ్న అడుగుతాను
నేను కౌన్సిలింగ్ సెషన్స్‌లో క్లైంట్స్‌తో మాట్లాడుతున్నపుడు దాదాపు అందరిలో ఒక కామన్ ఆలోచనా విధానం “Thought pattern” చూస్తూ ఉంటాను. అదేమిటంటే Why me”, “Why only me”. ‘నాకు ఎందుకు ఇలా జరుగుతుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది’ అని బాధపడుతూ ఉంటారు. ఈ ప్రశ్నను వారు తమకు తాము ఎన్నో సార్లు వేసుకొని ఉంటారు. అలానే వారి సన్నిహితులతో ఎన్నో సార్లు బాధపడి ఉంటారు. అయితే నేను వారి సమస్యలను, బాధలను ఎంతో జాగ్రత్తగా, శ్రద్ధతో, ఎంపతీతో విన్న తర్వాత వారిని ఒక ప్రశ్న అడుగుతాను. ‘నిజంగా మీరు ఒక్కరే బాధలు పడుతున్నారా? ఆలోచించండి. మీ చుట్టూ ఉన్న వారిని గమనించారా? వారికి బాధలు లేవా, సమస్యలు లేవా, సమస్యలు లేని ఒక్క మనిషిని, ఒక్క ఇంటిని, ఒక్క కుటుంబాన్ని నాకు చూపించండి’ అని. అప్పుడు వారు నిజంగా ఆ దృక్పథాన్ని వదిలి అర్థం చేసుకోవడం మొదలుపెడతారు.
మార్పు చాలా ముఖ్యం
ఆలోచనా విధానంలో మార్పు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం నిVictim” Role నుంచి బయటపడటానికి. “action తీసుకోవడం మొదలుపెట్టడానికి ఇది చాలా అవసరం. Why me”, “Why only me అనే ప్రశ్న అడుగుతూ, బాధపడుతూ Victim Role లో ఉండిపోతే జీవితంలో ఏ అడుగు ముందుకు వేయలేము అని గ్రహించాలి. మన అందరి జీవితాలలో కష్టసుఖాలు సాధారణం. ఇది అర్థం చేసుకొని కష్టాలను ఛాలెంజెస్‌లా, ఒక ఎక్స్‌పీరియన్స్‌లా తీసుకోవాలి. ముందుకు సాగాలి ధైర్యంతో.
ఓపెన్ మైండ్‌తో…
ఇక నుంచి Why me, Why only me అనే ప్రశ్నకు బదులుThis is a phase in life. This too shall pass అని గుర్తు చేసుకొందాం. ఇలా మనం ధైర్యంతో, ఓపెన్ మైండ్‌తో ఆలోచించినపుడు సమస్యలకు దారులు కనిపిస్తాయి. ధైర్యం, ఓపిక అనేవి ఎంతో అమూల్యమైన అవసరమైన ఆయుధాలు మరువకండి. మనం మనతో ఎలా సంభాషిస్తున్నాము అంటే సెల్ఫ్ లాంగ్వేజ్ అనేది మన ఉన్నతికి పురోగతికి ఎంతో ముఖ్యమైనది. మన సెల్ఫ్ లాంగ్వేజ్, మైండ్‌సెట్ పాజిటివ్‌గా దృఢంగా ఉన్నపుడు ఇతరులు ఏమన్నా, ఎంత కించపరిచినా మనం ధైర్యాన్ని కోల్పోము. మన లక్ష్యంపైన దృష్టి కోల్పోము, గురి తప్పము. సెల్ఫ్ లాంగ్వేజ్ గురించి మరింత వివరంగా వచ్చే వారం చర్చిదాం. సెలవా మరి. ఎప్పుడూ మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆశిస్తూ…
Dr.Prathusha. Nerella
MD( General Medicine) CCEBDM; CCGDM; NLP; FID
Senior General Physician
Positive Psychologist certified Nutritionist
Diabetes And Lifestyle Expert
Pranic Healer Chiief Holistic Health Consultant And Medical Director @ Praveha General, Diabetes And Lifestyle Clinic – A Holistic Centre With Integrated Approach.
Ph: 8897684912/040-49950314